నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం సృష్టించింది. టీపీ గూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా లీకైంది. వాటర్‌బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ భారీగా వ్యాపించింది. అమోనియా గ్యాస్ లీక్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా అందరూ మాస్కులు…
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం 5 గంటల 20 నిమిషాల సమయంలో మాధవ్‌తో పాటు మరో ఐదుగురిని 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలు అధికారులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేయడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. గోరంట్ల మాధవ్‌ను మొదట నెల్లూరు జైలుకు…
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను గాల్లో కలిపేసింది. శ్రీరామనవమి వేడుకల్లో గ్రామమంతా ఆనందోత్సవాల్లో ఉన్న సమయంలో అక్కడ చిన్నారుల మృతి వార్త విషాదాన్ని నింపింది. చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో నరసరాజు కుమారుడు దేవాన్, శేఖర్ రాజు కుమారుడు విజయ్, వెంకటేష్ కుమారుడు యశ్వంత్ అప్పటివరకు సీతారాముల ఊరేగింపులో పాల్గొని.. ఈత కోసం సమీపంలోని చెరువులోకి వెళ్లారు. మట్టి కోసం తవ్విన గుంటల్లో ఈత కోసం…
ఈరోజు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్ యాప్‌లోనూ రిజల్ట్స్ పొందవచ్చు. వాట్సప్ నంబరు 9552300009కు ‘హాయ్’ అని ఎస్ఎంఎస్ చేసి.. ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి. వాట్సప్ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టడం.. లేదా…
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.
ఆన్లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనం భారీన పడిన ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. భూమి కొందామని దాచిన కోటిన్నర డబ్బును ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ మాయలో పడి పోగొట్టాడు. డబ్బేదని కుటుంబ సభ్యులు అడగగా.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సదరు వ్యక్తి చివరకు ఆత్మహత్యే దిక్కనుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు…
తిరుమలలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపంలో ఈ వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 11) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడి అధికారులు రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలు…
ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్లు సమావేశంలో పాల్గొననున్నారు. వైఎస్ జగన్ నిర్వహించే సమావేశంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసీపీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ…
మద్యం స్కాం కేసులో సీఐడీ నోటీసులను సవాలు చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. తొందర పాటు చర్యలు తీసుకోకుండా సీఐడీకి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా హైకోర్టు నిరాకరించింది. 164 స్టేట్మెంట్ ఇవ్వటానికి వెళ్తే అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలని కోరటంతో ఆ దిశగా నోటీసులు…
సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కొద్దిసేపట్లో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తారన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది అని హోంమంత్రి చెప్పారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయం రెండో బ్లాక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్‌లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది.…