గంజాయి అరికట్టడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. ఏఆర్ గ్రౌండ్లో జరిగిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కమిషనరేట్ పరిధిలో గంజాయి సేవిస్తున్న, సరఫరా చేస్తు న్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి సేవిం డచడం వలన జరిగే అనర్థాలన ఆయన వివరించారు. బెజవాడలో గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో వంద ల సంఖ్యలో యువకులు, విద్యార్థులకు కౌన్సిలింగ్…
గుంటూరులోని స్వరూపనందేంద్ర సరస్వతి స్వామీ జన్మదినం సందర్భంగా ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు హోంమంత్రి సుచరిత పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిబంధనలకు లోబడి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలన్నారు. స్వామీ వారి విశిష్ట సేవలు దేశవ్యాప్తంగా అందుతున్నాయన్నారు. వేద పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చదువుతూ సమాజ సేవ చేస్తున్నారన్నారు. స్వామీ వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకుండాలని ఆమె కోరుకున్నారు. పాదయాత్ర చేస్తూనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిబం ధనల ఉల్లంఘన జరిగితే…
సింహాచలం గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థుల భోజన వసతిసదుపాయాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసు కున్నారు. వసతి భవనం శిథిలావస్థకు చేరుకోవడంపై మంత్రి అధికా రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో నిద్రిస్తున్న 300కు పైగా విద్యార్థులను మరొక భవనంలోకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. స్కూలు భవనం, తరగతి గదులను దేవాలయం లాగా తయారు చేయాలి…
చేపల వేటకు వెళ్లి నలుగురు మృతి చెందిన ఘటన విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం చాపరాజు పాలెంలో చోటుచేసు కుంది. చేపల వేట నిమిత్తం సమీపంలోని బొంతు వలస గడ్డవద్దకు వెళ్లిన గిరిజనులు ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన వారిని జీకే వీధి మండలంలోని చాప రాజు పాలెం గ్రామనికి చెందిన గడుతూరి నూకరాజు (35) గడుతూరి తులసి (9) గడుతూరి లాస్య (10) రమణబాబుగా గుర్తించారు. ముగ్గురు మృతదేహలు లభించాయి. రమణబాబు…
శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల్ని రెచ్చగొట్టడం సరికాదని, పాదయాత్రకి అడ్డంకులు సృష్టించడం సబబు కాదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. కడుపు మండి ధర్నా చేసే మహిళా రైతుల మాటలను వక్రీకరిస్తూ మాట్లాడటమేంటని ఆమె మండిపడ్డారు. ధర్నా చేస్తున్న మహిళా రైతుల్ని బూటు కాళ్లతో తన్నించడం ఎంత వరకు సమంజసం వైసీపీ నాయకు లను ఆమె నిలదీశారు. రాజధాని రైతులను దుర్భాషలాడితే సహిం చేది లేదని హెచ్చరించారు. నిరసన తెలియజేసినవారికి మద్దతు…
ఆపరేషన్ పరివర్తన్ కింద 800 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మ ఆట్లాడారు. గంజాయి సాగును అరికట్టేందుకు ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నామన్నారు. ఈ ఆపరేషన్‌లో 80 టీమ్‌లు పాల్గొన్నాయని, గంజాయి సాగును ధ్వంసం చేయకుండా గిరిజనులు ప్రతిఘటిస్తున్న సంఘటనలు తక్కవగా చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలి పారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి చాలా మంది గిరిజ నులే స్వచ్ఛంధంగా…
ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాం. ఈ మధ్య కాలంలో గంజాయి రవాణా ఎక్కువగా ఉంది అని విశాఖ డీసీపీ గౌతమీ శాలి అన్నారు. రూరల్ ఏరియాల్లో భారీగా గంజాయి పట్టుబడుతుంది. నగర పరిధిలో హోటల్స్, లాడ్జిల్లో, వాహన తనిఖీ లు ముమ్మరం చేస్తున్నాం. రెండు వారల్లో 310 బైండొవర్ కేసులు నమోదు చేసాము. ఆపరేషన్ పరివర్తన లో భాగంగా మార్పు కార్యక్రమం ద్వారా గంజాయికి బానిస అయిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నాము.…
సీజన్ ముగిసింది కానీ టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌యార్డులో శనివారం మొదటి రకం టమాటా కిలో ధర రూ.74, అత్యల్పంగా రూ.12 పలికింది. గత నెల రోజులుగా జిల్లాలోని పడమటి మండలాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగుబడి అనూహ్యంగా తగ్గింది. మార్కెట్లో డిమాండ్ పెరగడంతో టమోటా ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కిలో రూపాయికి పడిపోయిన టమోటా ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం…
రాజధానిగా అమరావతిని అమలుచేయాలంటూ రైతులు, ప్రజాసంఘాలు చేపట్టిన పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై రచ్చ చేసే వైసీపీ వాళ్లకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు, లౌడ్ స్పీకర్లు రైతుల మహా పాదయాత్రకే అడ్డొచ్చాయా డీజీపీ గారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. వైసీపీ ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేస్తున్న పోలీసులు అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తూ నోటీసులిస్తున్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణిచేయాలనే…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజీల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుందని, కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదని, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పెట్రోల్‌పై 5రూపాయలు, డీజీల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పన్ను తగ్గించాలని కేంద్రం కోరిందని ఆయన తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను తగ్గిస్తే బీజేపీయేతర రాష్ట్రాల్లో పన్ను తగ్గించ లేద న్నారు. ఏపీలో పెట్రోల్ రేట్లు తగ్గించకపోవడం పై…