ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,670 శాంపిల్స్ పరీక్షించగా.. 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 175 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,67,410…
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో మూడో రోజు కొనసాగుతున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాలు ఇంటింటికి చేరుతున్నాయన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. గతంతో పోలిస్తే సమస్యలపై వచ్చే దరఖాస్తులు 90శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడు వేయలేదని మంత్రి తెలిపారు. నీళ్లు,…
ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. జీవోల్లో ఐదు శాతమే సైట్లో ఉంచుతున్నారని న్యాయవాది బాలాజీ తెలిపారు. కాగా ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే కొన్ని రహస్య జీవోలే అప్లోడ్ చేయడం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా అన్ని జీవోల వివరాలను వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని…
తెలంగాణ-ఆంధ్ర రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్యలో నెలకొన్న సరిహద్దు వివాద సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి మత్స్యకారుల సమస్యను పరిష్కరిం చేందుకు ప్రత్యేక కృషి చేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తెలిపారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం పరిసర ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో చేప పిల్లలను వదిలారు. అనంతరం మత్స్యశాఖ జె.డి శ్యామలమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారుల నుద్దేశించి మాట్లాడుతూ ఎన్నోఏళ్ల నుంచి కృష్ణా నదిలో చేపల…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా…
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది సిమెంట్ కంపెనీ. 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటు చేసింది శ్రీ సిమెంట్ గ్రూప్. ఈ గ్రూప్ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని చలి వణికిస్తుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ర్టంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పగటి పూట సైతం చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. Read Also: హైదరాబాద్లో రికార్డు సృష్టించిన ‘చలి’ మారేడు…
ఏపీ అభివృద్ధి కోసమే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించి, కేవలం తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించిందన్నారు. అమరావతిపై బీజేపీ వైఖరి కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా ఉందన్నారు. 3 రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్రమే చెప్పిందని సుచరిత చెప్పారు. Read Also: జనసేన ‘డిజిటల్’ ఉద్యమం ప్రారంభం.. స్పందన లభించేనా? కానీ ఇక్కడ మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ చెబుతోందన్నారు.…
అమరావతి తిరుపతిలో జరిగే రాజధాని రైతుల బహిరంగ సభకు సీపీఎం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాజధాని రైతులు తిరుపతి సభకు ఆహ్వానించారు.. మేమూ వెళ్లాలనుకున్నామన్నారు. కేంద్ర బీజేపీ నేతలు ఈ సభలకు హాజరవుతున్నారని తెలిసిందని… రాష్ట్ర ప్రయోజనాలకు హాని తలపెట్టింది బీజేపీనేనని ఆగ్రహించారు. అలాంటి బీజేపీ నేతలు పాల్గొనే సభల్లో మేం పాల్గొనబోమని.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేదే సీపీఎం విధానమని గుర్తు చేశారు మధు. ఢిల్లీలో ఓ…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి…