విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే శీతల గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలి అధికంగా ఉండటంతో పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతలగాలులు, దట్టమైన పొగమంచును కప్పి ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు. చూడటానికి సుందరంగా ఉన్న చలి కారణంగా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. Also Read: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర ఏజెన్సీలోని వరుసగా…
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను రాష్ర్టహైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు పిటిషన్ వేయగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.…
ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతంలో ఉన్న హైకోర్టుకు అదనంగా మరో భవనాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ భవనాన్ని గ్రౌండ్+5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర…
అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్…
తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామ శివారులో సాయితేజకు సైనిక గౌరవవందనం నిర్వహించడానికి చిన్న మైదానాన్ని సిద్ధం చేశారు. మైదానం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.సాయితేజ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో… కుటుంబ సభ్యుల DNA శాంపిళ్ల ఆధారంగా గుర్తించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం సాయి భౌతిక కాయం బెంగళూరు…
అంగన్వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64, 445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతినెలా పాల ప్యాకెట్లను ప్రస్తుతం…
అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం మడకశిర పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది.ఈ చెరువు రాష్ట్రంలోని నైరుతి మూలలో కర్ణాటక సరిహద్దులకు సమీపంలోని ఆనుకుని ఉంది. ఈ చెరువు కర్ణాటకలోని సమీప కాలువల ద్వారా తీసుకువెళ్లే వర్షపునీటిపై ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా మడకశిర మునిసిపాలిటీ, సమీప గ్రామాలకు ఇది ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. పట్టణంలోని ప్రజలకు 3కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని అందించేందుకు చెరువుల్లో…
నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని నేను చూసుకుంటానంటున్నారు లాన్స్ నాయక్ సాయి తేజ సోదరుడు మహేష్.సాయితేజ లేని లోటు తమ కుటుంబానికి తీరని లోటని అని సాయి సోదరుడు మహేష్‌బాబు అన్నారు. అన్న స్ఫూర్తితోనే తాను ఆర్మీలోకి వెళ్లానని మహేష్ తెలిపారు. అన్నకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారిని తాను బాగా చూసుకుంటానన్నారు. ఆర్మీలో అన్న ఎంతో కష్టపడి పనిచేశాడని, బిపిన్ రావత్ మన్ననలు పొందాడన్నారు. అందుకే తన వ్యక్తిగత భద్రతకు అన్నయ్యను నియమించుకున్నారని సాయితేజ…
తమిళనాడులోని నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.రూ. 50లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మరణించిన సంగతి తెల్సిందే.. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్ఏ టెస్టులు చేసి…