కోవిడ్ – 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌కు విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహా విష్ణు అందజేశారు. Read Also: రైతులకు కేసీఆర్ చేసిందేమీ లేదు: రామచందర్ రావు ఈ…
ఏపీలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తాయి. మాల్స్, దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పని సరిగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్.. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు.మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను…
కుప్పం పర్యటనలో చంద్రబాబు చెప్పినవన్నీ అవాస్తవాలని, చంద్రబాబు ఎన్ని కుప్పి గంతులు వేసినా ప్రజలు నమ్మరని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడితే అన్యాయంగా ఉంటుందన్నారు. రైతులను రాజులుగా చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన ప్రభుత్వం మాదని మంత్రి అన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని దశల్లో రైతులకు చేయూత అందించి ఆత్మ స్థైర్యం కల్పించిన ప్రభుత్వం…
ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీ ఇప్పుడు ఎదుగుతూ వుంది. దానికి మేం కారణం కాదు. కాంగ్రెస్ బలహీనంగా వుంది. మతాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీజేపీ యూపీలో ఎదిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిసిపోయారు. మేం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అని భావించలేదు. కమ్యూనిస్టుల శక్తి ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ మీద అసహనంతో బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ ని అవసరమయిన సమయాల్లో విమర్శించాలి.…
కమ్యూనిస్ట్ పార్టీలు మారుతున్నాయన్నారు సీపీఎం జాతీయ నాయకుడు బీవీ రాఘవులు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీకి దూరంగా వున్న పార్టీలకు మేం దగ్గరవుతాం. సీఎం కేసీఆర్‌ని కలవడంలో ఉద్దేశం అదే అన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒకే విధంగా వుంది. ఏదో శక్తి దేశంలో నిలబడి వుంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు భిన్నంగా మేం నడుస్తున్నాం. రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది. బీజేపీ మతం తీసుకు వస్తోంది. కమ్యూనిస్టులు అన్ని శక్తుల్ని…
టీటీడీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆగడాలు యాజమాన్యం పరువు తీసేలా మారాయి. ఒకొక్కటిగా వెలుగు చూస్తున్న ప్రిన్సిపాల్ సురేంద్ర ఆగడాలు స్టూడెంట్స్‌లో అసహ్య భావనను పుట్టిస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా ఫోన్లో మాట్లాడి ఆ ఆడియో టేపులను రికార్డు చేసేవాడని, వాటిని మళ్లీ వారికే పంపించి బ్లాక్ మెయిల్ చేసేవాడని బాధితులు పేర్కొంటున్నారు. Read Also: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు: కిషోర్ కుమార్ రెడ్డి తాను చెప్పినట్లు వింటే.. పరీక్షల్లో పాస్ చేస్తానని, పరీక్ష సరిగ్గా రాయకపోయినా 70…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. పెద్దిరెడ్డి కూడా సీఎం కావాలని కోరుకున్నాడని కిషోర్‌కుమార్ రెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా అందరూ సీఎంలతో గొడవలు, అసమ్మతి ఆయనకు మాములేనంటూ…
వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వైసీపీ అని చెప్పారు. రైతుల కోసం అనేక ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు.ఎరువులకు ఇబ్బంది లేకుండా మిగులు నిల్వలతో రైతుల కోసం ఆలోచిస్తున్న…
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో భేటీ అంశాలను వీర్రాజు మీడియాకు వెల్లడించారు. పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనుమానాస్పదంగా ఉందని సోము వీర్రాజు అన్నారు. దేశ బోర్డరుకు పది కిలోమీటర్లు, పాకిస్తాన్‌కు దగ్గరలో ఉన్న ప్రాంతమని అలాంటి చోట ప్రధానికి రక్షణ కల్పించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందన్నారు. ప్రధాని లాంటి పెద్దలకు బ్రిడ్జిలు వచ్చినప్పుడు భద్రత…
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం అధికారపార్టీలో చీలిక తెచ్చిందా? వర్గపోరు బయటపడిందా? ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ విభేదాలను మరో అంకానికి తీసుకెళ్లాయా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు..!సైలెంట్ రాజకీయాలకు పెట్టింది పేరైన తణుకులో ప్రస్తుతం రాజకీయం వాడీవేడిగా ఉంది. అదీ అధికార వైసీపీలో కావడంతో మరింత అటెన్షన్ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఆ సమస్య పెద్దగా…