జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌తో తీరనున్న సొంతింటి కల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ మధ్య తరగతి ప్రజలకు తీరనున్న సొంతింటి కల ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించింది. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస స్థలాలు, ప్లాట్లు కేటాయించి వారి సొంతింటికలను సాకారం చేసే దిశగా జగన్ సర్కార్ పయనిస్తోంది. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఔట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి ననుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్‌ఐజీ (మిడిల్ ఇన్‌కం గ్రూప్ లేఔట్) పథకం అమలు కానుంది. రేపు క్యాంప్ కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. రూ. 18 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్రంలో వారు ఉంటున్న ప్రాంతంలో సరసమైన ధరలకు నివాస స్ధలాల కేటాయింపు జరిగేలా చూస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఔట్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేటుతో కేటాయించనున్నారు. అన్ని పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగాల నియామాల మేరకు ఒక ఏడాది కాలంలో ఈ లేఔట్లను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు.
Read Also: కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూసూద్ సోదరి
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఒక సంవత్సర వ్యవధిలో 4 వాయిదాలలో డబ్బు చెల్లించే సౌకర్యం కల్పించనున్నారు. చెల్లింపు పూర్తయిన వెంటనే ప్లాట్లను అభివృద్ధి చేసి లబ్ధిదారులకు స్వాధీనపరుస్తారు. దరఖాస్తుతో పాటు ప్లాటు విలువలో 10 శాతం, అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలల్లోపు లేదా రిజిస్ట్రేషన్ తేది లోపు ఏది ముందయితే అప్పటికి మిగిలిన 30 శాతం చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏకమొత్తంగా చెల్లించిన వారికి 5 శాతం మేరకు ఆకర్షణీయమైన రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. https://migapdtcp.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది.
లేఔట్ల ప్రత్యేకతలు..
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్, గవర్నమెంటే లేఔట్ చేస్తుంది.కుటుంబాల అవసరాలను బట్టి 150,200 మరియు 240 చదరపు గజాల స్ధలాలు ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తుంది. పర్యావరణ హితంగా ఉండేలా లేఔట్ల విస్తీర్ణంలో 50 శాతం వరకు స్థలం సామాజిక అవసరాలకు కొంత స్థలాన్ని కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్ మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్ధ, వరద నీటి డ్రెయిన్లు, విద్యుదీకరణ మరియు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. పార్కులు, ఆట స్ధలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకు మరియు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేకంగా స్థలాల కేటాయింపు ఉంటుంది. లేఔట్ నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరియు పట్టణాభివృద్ది సంస్థల ద్వారా సంయుక్త నిర్వహణ చేపడతారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు