నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా వుండే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సరదాగా సేదతీరారు. అది కూడా అండమాన్ దీవుల్లో. ఆయన చేసిన స్కూబా డైవింగ్ యువకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ స్కూబా డైవింగ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. పీఆర్సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు తెలిపింది. పెండింగ్ డీఏలు…
హైదరాబాద్‌లో ఉన్న నాబార్డ్ రీజనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాసిన లేఖను… బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందజేశారు. ముంబైలో గోవిందరాజులును కలిసి పాతూరి ఈ లేఖను స్వయంగా ఇచ్చారు. ఈ సందర్బంగా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పాతూరి కోరారు. అమరావతిలో ఇప్పటికే కేంద్రప్రభుత్వం నాబార్డుకోసం స్థలాన్ని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.అమరావతిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వెబ్‌నార్ ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెమ్ హస్పటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి. పలనివేలు, పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కువ శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగానికి ఎనలేని సేవలందించిన డా. డి నాగేశ్వర్‌రెడ్డి, పళనివేలకు గౌరవ డాక్టరేట్‌ను…
ఏపీలో పీఆర్సీ వ్యవహారం హట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెల్సిందే.. తాజాగా ఈ రోజు ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల సమస్యలను సీఎం విన్నారని ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుందన్నారు. కొన్ని సంఘాలు 27…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజులో 500కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 89, కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 49 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 128 మంది కరోనా…
ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన టీడీపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు టీడీపీ తీరు ఉందని విమర్శించారు. Read Also:జగ్గారెడ్డి కీలక నిర్ణయం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా . హెరిటేజ్ లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉందన్నారు. హెరిటేజ్‌లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ. రూ.59 ఉంటే మార్కెట్ రేటు 52 రూపాయలు ఉందన్నారు. అలాగే…
ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది.సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పీఆర్సీ పై చర్చించారు. ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం సమాలోచనలు జరిపారు. Read Also:కస్టమ్స్ సుంకం ఎగవేసిన షావోమి.. కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు ఎంత శాతం…
విశాఖలో చోటు చేసుకున్న మత్స్యకారులు వాగ్వాదానికి సంబంధించి మంత్రుల సమావేశం ముగిసింది. ఈసందర్భంగా ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. అనుమతి ఉన్న 11 రింగు వలల బోట్లలో మూడింటికే ట్రాన్స్ ఫా౦డర్స్ ఉన్నాయి. వాటితో 8కిలోమీటర్ల తరువాత వేట కొనసాగించవచ్చని తెలిపారు. మిగిలిన 8 రింగు వలల బోట్లు ట్రాన్స్‌ఫాండర్స్ ఏర్పాటు చేసుకుని వెళ్లొచ్చిని తెలిపారు. రింగు వలల వివాదం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉందని, మత్స్యకారులు సామరస్యంతో ఉండాలని మంత్రి…
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షల దిశగా వెళ్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ఆదివారం రోజున పూర్తి లాక్ డౌన్‌ను ప్రకటించింది. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తునే ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ముప్పు తప్పదని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా తాజాగా ఏపీలోనూ మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. Read Also: షాహినాయత్ గంజ్‌లో కల్తీ నెయ్యి…