1 దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల నమోదవుతూనే వుంది. తాజాగా భారత్లో 2 లక్షల 71 వేల కేసులు నమోదయ్యాయి. 16.65 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా 314 మంది మరణించారు. పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. 16.28 శాతంగా నమోదైంది. గత వారం పాజిటివిటీ రేటు 13.69 శాతంగా వుండేది. భారత్ లో 7,743కు చేరింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య. ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 4,570 కోవిడ్ కేసులు…
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు… మరికొన్ని ప్రాంతాల్లో గాలివానలు భయపెడుతున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటికే పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దట్టంగా మంచు కురిసే వేళలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. అకాలంలో పడుతున్న ఈ వర్షాలు… రైతులకు అపార నష్టాన్ని మిగిలుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర…
వినుకొండ రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని జగన్ సర్కార్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని నిప్పులు చెరిగారు.గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలన్నారు. Read Also: ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదు: వైవీ సుబ్బారెడ్డి చేయని తప్పుకు సంక్రాంతి…
ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, జగన్ భేటీలపై స్పందించారు. జూన్లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి సీఎం జగన్ నిర్ణయం మేరకు పరిశీలిస్తామన్నారు.సీఎం జగన్ నిర్ణయం ప్రకారం ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారన్నారు. పార్టీ కోసం పని చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు బాగా ఉపయోగపడతారో వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని పేర్కొన్నారు.…
సీఎం జగన్ను చిరంజీవి కలిసింది కేవలం సినీ పరిశ్రమపై చర్చించటం కోసమేనని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ విషయాన్ని కూడా ఎందుకు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. అలా ఎందుకు చేస్తారో కూడా తెలియడం లేదని మంత్రి మండిపడ్డారు. కేవలం సినిమా వాళ్ల కోసమే చిరంజీవి వస్తే ఏదో ఒక రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం జగన్ అన్నదమ్ములను విడదీసి రాజకీయం…
ప్రముఖ హేతువాద ఉద్యమ నేత, కవి త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. త్రిపురనేని కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు. విశాల భావాలతో రామస్వామి నాటి సమాజం పై చెరగని ముద్ర వేశారు. సంఘసంస్కరణ కర్తగా సమాజంలో మార్పును ఆకాంక్షించారు రామస్వామి చౌదరి. తన కలంతో ఎంతోమందిని కదిలించేలా చేశారు.ఇతరులను ప్రశ్నించటం సులభం. కాని తనను తాను…
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు చెప్పిన కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోడి పందాలు జరిగాయి. Read Also: వైసీపీ ఎంపీకి సైబర్…
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుండి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న ఐపీఎస్ అధికారులు. వీరితో ఢిల్లీ నుంచి చీఫ్ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర వర్చువల్ బ్రీఫింగ్ ద్వారా మాట్లాడారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్,మణిపూర్, గోవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చేయాల్సిన విధులను వీరికి వివరించారు. Read Also: ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు ఏపీ నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్న 35…
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది నుంచి అదనంగా నీరు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మెన్ కు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ప్రభుత్వం తరపున తరపున మూడు లేఖలను రాశారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 45 టీఎంసీల నీరు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును లేఖ ద్వారా కోరారు. అలాగే పోలవరం ద్వారా 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని తెలిపారు. Read…
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రిపోర్టులోని అంశాలను ఆయన వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. గడిచిన రెండేళ్లలో దేశంలో 2,261 చ.కి.మీ. మేర పెరిగిన అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం…