ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. ఇక తాజాగా ఏపీలో మరో సారి కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17, 384 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 514 కి చేరింది.
Read Also: పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి
ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1066 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 66 , 762 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38, 055 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,19,22,969 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సంక్రాంతి పండుగ అనంతరం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాఆరోగ్య శాఖ సూచిస్తోంది.
#COVIDUpdates: 18/01/2022, 10:00 AM
— Health Medical and Family Welfare Department – AP (@ArogyaAndhra) January 18, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,14,489 పాజిటివ్ కేసు లకు గాను
*20,63,867 మంది డిశ్చార్జ్ కాగా
*14,514 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 36,108#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/l3TVh7NMDA