దేశంలో హిందువులకు ముప్పు రాబోతుందని జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా కర్నూల్‌లో .. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.విజయవాడలో ప్రజాగ్రహ సభ ద్వారా నిద్ర లేకుండా చేసి శరణు ప్రభు అంటూ ఢిల్లీ వెళ్లాలా చేశామన్నారు. పీఎఫ్ ఐ వంటి సంస్థలు ఐఎస్‌ఐ కనుసన్నల్లో పనిచేస్తుందన్నారు. ఢిల్లీలో ఫీఎప్‌ఐ మత అల్లర్లు సృష్టించిందన్నారు.
Read Also: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయి: టీజీ వెంకటేష్
కేరళలోని ప్రొఫెసర్ చేతని నరికేశారని జీవీఎల్ అన్నారు.పీఎఫ్ ఐ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని జీవీఎల్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక…ఈ సంస్థను నిర్ములించకుంటే పార్లమెంటులో పోరాడతామని తెలిపారు. 5 శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్లు ఉంటే ప్రతి వాడాలో మసీదులు, చర్చిలు నిర్మిస్తుందని ఎద్దేవా చేశారు. నరేగా నిధులతో వీటిని ఎలా నిర్మిస్తారని జీవీఎల్ ప్రశ్నించారు. అన్యమత సంస్థల ఆస్తులపై ఉన్న శ్రద్ధ హిందూ ఆస్తులపై ఎందుకు లేదన్నారు.లవ్ జిహాద్ చేస్తున్న పీఎఫ్ ఐ పై ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పలన్నారు. మదర్సాలను మూసివేయాలని జీవీఎల్ అన్నారు.