నేడు ఢిల్లీకి ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నేడు శాసనసభలో ఏపీ వార్షిక బడ్జెట్ ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. 2022-23 బడ్జెట్ ఆమోదానికి సమావేశం. ఇవాళ్టి నుంచి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం. నల్లగొండ జిల్లా కొండపాకగూడెం నుంచి పాదయాత్ర. ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ఏపీలో ఉదయం 11 గంటలకు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి కన్నబాబు నేడు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ సవాల్…
ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ…
జిల్లాల విభజన ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు తెచ్చిపెట్టింది. జిల్లా కేంద్రం కోసం జరుగుతున్న ఉద్యమాలు… ఇంకెక్కడో ప్రకంపనలు తీసుకొస్తున్నాయి. సరికొత్త వివాదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అంచనా వేయలేకపోతున్నారట స్థానిక నేతలు. జిల్లా కేంద్రం కోసం వైసీపీ నేతలు పోటాపోటీ ఉద్యమాలుజిల్లాల విభజన ప్రక్రియ కడప జిల్లా రాజంపేటలోని రాజకీయపక్షాల మధ్య చిచ్చుపెట్టింది. ఇప్పటి దాకా రెవిన్యూ డివిజన్‌గా ఉన్న రాజంపేటను జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో ఎవరూ ఊహించని విధంగా…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడికక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు.…
ఏపీలో మండిపోతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు. ముఖ్యంగా వంటగదిలో ఎక్కువగా వాడే ఆయిల్ ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు కిరాణా వ్యాపారులు. తిరుపతిలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. అధిక మొత్త0తో వంటనూనెలు అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా నూనె ప్యాకెట్ ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు వేసి విక్రయిస్తున్నట్టు…
ఇసుక ఎప్పుడూ డిమాండ్ వున్న వస్తువు. కొంతమంది నేతలు ఇసుక నుంచి కూడా కరెన్సీ పిండేస్తారు. తూర్పు గోదావరిలో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సబ్ కాంట్రాక్ట్ లు పేరుతో దోచేస్తున్నారు. అనుమతి లేకుండా కొన్ని చోట్ల, నిబంధనలకు విరుద్ధంగా ఇంకొన్నిచోట్ల అడ్డంగా తవ్వేస్తున్నారు. జిల్లాలో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ ఛోటా నేతలు.. సబ్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందినకాడికి తవ్వుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. బోట్స్‌మన్ సొసైటీలైనా, ఓపెన్ ర్యాంపులైనా… వెనక రాజకీయ…
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించనున్న గుంటూరు రేంజ్ డీఐజీ సీ.యం.త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ మలిక గర్గ్ అన్నవరం దేవస్థానంలో అందుబాటులోకి వచ్చిన నిత్యాన్నదానం భోజనాల తయారీకి స్టీమ్ బాయిలర్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్…
పర్యావరణ పరంగా తీవ్ర వత్తిడులు కనిపిస్తున్నాయి. అకాల వర్షాలు, విపరీతమయిన చలి.. వీటికితోడు మండే ఎండలు. ఆరోగ్యంపై, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో సూరీడు తన ప్రతాపం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్ ప్రకారం ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం అంటున్నారు. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ…
నగర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కే మాస్టర్ ప్లాన్ వేశారు అక్కడి అవినీతి అధికారులు. చెప్పింది చేస్తే నాకేంటి..? అని సూటిగా సుత్తిలేకుండా అడిగేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడానికి తమలోని మాటకారితనాన్ని బయటకు తీస్తున్నారు మాయగాళ్లు. ‘మాకేంటి..!?’ అని సిగ్గులేకుండా అడిగేస్తున్నారా? చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్‌ప్లాన్ కాసులు కురిపిస్తోంది. ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు…