భారీవర్షాలు తెలుగు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15 వరకూ తెలంగాణలో భారీవర్షాలు కురవనున్నాయి. బుధవారం అనేక ప్రాంతాల్లో కురిసన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు పడనున్నాయి.
వైఎస్సార్ కడప జిల్లాలో పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు అధికారులు. ఇటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు పడుతున్నాయి. గండికోటలోకి చేరుతున్న వరద నీటితో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. రాయదుర్గం పట్టణంలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీ బజార్ ప్రాంతంలో ఇళ్లలో, దుకాణాల్లో వెళ్లిన వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నారు.విడపనకల్లు మండలంలో భారీ వర్షంతో పొంగి పొర్లుతున్నాయి వాగులు, వంకలు. పాల్తూరు, ఉండబండ,ఆర్.కొట్టాల, డోనేకల్ వద్ద ఉధృతంగా ప్రవహిసున్నాయి వాగులు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
Read ALso: Suhana Khan Glamorous look: కుర్రాల్లను హీట్ ఎక్కిస్తున్న షారుక్ కూతురు.. జాకెట్ తీసి మరీ..
అనంతపురం జిల్లాలో అర్థరాత్రి వంకలో చిక్కుకున్న ఐదుగుర్ని కాపాడారు బుక్కరాయసముద్రం పోలీసులు. మరువ పారుతుండటంతో భద్రంపల్లి వద్ద వాగు ఉధృతి పెరిగింది. కారులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడారు పోలీసులు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంటీరియర్ కర్ణాటక నుండి విదర్భల మీదుగా బలహీన పడిన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ – ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్న క్రింది స్థాయి గాలులతో వాతావరణం మారింది. తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఈ రోజు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కి భారీగా చేరుతున్న వరద నీటితో సమీప గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏలేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 24.11 టిఎంసిలు కాగా ప్రస్తుతం 21. 61 టీఎంసీలుగా వుంది. దిగువకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇటు తుంగభద్ర జలాశయానికి కొనసాగుతుంది వరద. 20 గేట్ల ద్వారా దిగువ కు నీరు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1632.87 అడుగులుగా వుంది. ప్రాజెక్టుకి ఇన్ ఫ్లో 65,815 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 64,841క్యూ సెక్కులుగా వుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి నీట మునిగాయి పత్తి పంటలు…
పొంగి పొర్లుతున్న పెద్దహరివనం గర్జి వంకలు, వర్షానికి నిండిపోయింది రాంజల చెరువు.
Read Also: Kajal Aggarwal: ఏమాత్రం క్రేజ్ తగ్గని చందమామ.. లెగ్స్ అందాలను హైలెట్ చేస్తూ..