అమరావతి రైతుల మహా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి రైతులకు వ్యతిరేకంగా జేఏసీ నేతల నినాదాలతో హోరెత్తింది. మూడు రాజధానులు ముద్దు, ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు జేఏసీ నేతలు. అక్కడికి భారీగా చేరుకున్న వైసీపీ నేతలు, నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. అమరావతి రైతు యాత్ర ఇక్కడికి చేరుకోవడంతో భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. నిడదవోలులో రైతుల పాదయాత్ర పైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు జేఏసీ, వైసీపీ నేతలు. వెంటనే అదుపు చేశారు పోలీసులు, రైతులు మద్దతు దారులు, జేఏసీ నాయకులు పోటా పోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా వుంటే.. అయిదేళ్లు చంద్రబాబు పాలనలో అమరావతిలో షెడ్లు కూడా నిర్మించలేకపోయారన్నారు. విజయవాడలో ఆఫీస్ లు పెట్టి అమరావతిలో పెట్టామని చెప్పుకున్నారు..అమరావతి రైతుల యాత్రను చంద్రబాబే నడుపుతున్నాడు..వెనుకబడిన ఉత్తరాంధ్ర లో రాజధాని ఉండాలి…అటవీప్రాంతం వంటి అమరావతి ఎప్పటికీ అభివృద్ధి చెందదు.. చంద్రబాబు అమరావతి రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు డిప్యూటీ స్పీకర్, కోలగట్ల వీరభద్రస్వామి.
లక్ష మందితో విశాఖ గర్జన ర్యాలీ వుంటుందన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్. 3.7కి.మీ. దూరం జేఏసీ పాదయాత్ర.. ..పవన్ కళ్యాణ్ పర్యటన, టీడీపీ మీటింగ్, గర్జన ఒకే రోజు ఉండటంతో 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశామన్నారు. పవన్ కళ్యాణ్ టూర్ మధ్యాహ్నం ఉంటుందన్నారు. .ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రావడంతో గర్జన జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ టూర్ సందర్భంగా ర్యాలీ కోసం జనసేన ఎటువంటి అనుమతి కోరలేదన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్.
Read Also: Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?
విశాఖ గర్జన కార్యక్రమం ఫెయిల్ చేయాలనే పవన్ కళ్యాణ్ 15 న జనవాణి కార్యక్రమం ప్రకటించారని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ మాకు చీరలు ఇస్తా అంటున్నారు…వైసీపీ నాయకులకు చీరలు ఇచ్చే బదులు, భార్యాభర్తలుగా కలిసి తిరుగుతున్న మనోహర్ కి ఆ చీర ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు వైసీపీ పూర్తి మద్దతు వుంటుందన్నారు. విశాఖ గర్జన ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు.. వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని కావాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read ALso: Smriti Irani: ఆమె చేసిన ఏకైక నేరం.. నరేంద్ర మోడీకి జన్మనివ్వడమేనా..