ఏపీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార పసుపుధార జలాశయాలు నిండుకుండాల మారాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. కుమారధార పసుపుధార, ఆకాశగంగ జలశయాల నుంచి ఓవర్ ఫ్లోలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీట మునగడంతో తిరుపతిలో కంట్రోల్ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం…
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.…