Tulasi Reddy: ఏపీలో ప్రభుత్వ శాఖలకు సలహాదారులపై నియామకంపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారులపై తీవ్ర విమర్శలు చేశారు. వీరు సలహాదారులు కాదని.. స్వాహాదారులు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలు అంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన…
Ambati Rambabu: ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్ 1పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జీవో నంబర్ 1ను చంద్రబాబు పాటించలేదని.. ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్నాడని.. జీవో నంబర్ 1 ప్రకారం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టకూడదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే సభలు నిర్వహించాలన్నారు. జీవో నంబర్ 1…
JC Prabhakar Reddy: ఏపీలో వైసీపీ సర్కారు వ్యవహారశైలిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య సమరం నాటి పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైఖరిని ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు. అసలు సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగే స్వేఛ్చ కూడా…
OFF The Record: ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గతంలో చేసిన కామెంట్స్తో ప్రస్తుత బాస్ సోము వీర్రాజుకు బాగా కాలుతోందా? అందుకే సొంత జిల్లా నేతలకు వీర్రాజు గట్టిగా క్లాస్ పీకారా? ఇంతకీ ఇద్దరి మధ్య కొత్తగా పొగ పెట్టిన అంశాలేంటి? ఏం జరిగింది? కన్నాకు గౌరవ మర్యాదలతో స్వాగతం చెప్పిన కాకినాడ జిల్లా బీజేపీ నేతలు? కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. కన్నా తర్వాత ఆ పదవి సోము…
OFF The Record: ఇద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకరు ఎమ్మెల్యే .. ఇంకొకరు ఎమ్మెల్సీ. మొన్నటి వరకు కలిసిమెలిసి సాగిన నాయకులే. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య అగ్గి రేగింది. పరస్పరం ఫిర్యాదులు చేసుకునేంతగా విభేదాలు వచ్చాయి. పార్టీ కోసం కలసి సాగాల్సిన నేతలు.. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరా నాయకులు? శృంగవరపుకోటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఇదే నియోజకవర్గానికి చెందిన రఘురాజు ఎమ్మెల్సీ. ఇద్దరూ వైసీపీ నేతలే.…
Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నాడని.. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు అసలు కుప్పంలో ఓటే లేదన్నారు. కొత్త సంవత్సరం వేళ కందుకూరు, గుంటూరులో రక్తపాతానికి చంద్రబాబు కారకుడు అయ్యాడని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు జీవో నంబర్ 1ను చదవకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబు చతికిలపడిపోయాడని.. ఆయనలో చేవ లేదని జోగి రమేష్ ఎద్దేవా…
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దూరు వద్ద చంద్రబాబును పోలీసులు అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. అయితే డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరించారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధత లేదన్నారు. చీకటి జీవోలతో ఎమర్జెన్సీ పాలన తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం దయాదాక్షిణ్యాలతో సభలు నిర్వహించాలని అనుకుంటున్నారని చురకలు అంటించారు. రోడ్లపై కాకుండా ఆకాశంలో మాట్లాడతారా అని నిలదీశారు. తనను…