Chandrababu Pawan Kalyan Meeting: జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన ఇంట్లో భేటీ కానున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుప్పం ఘటనపై చంద్రబాబుని పవన్ పరామర్శించినట్టు తెలుస్తోంది. గతంలో విశాఖపట్నంలో పవన్‌కి చేదు అనుభవం ఎదురైనప్పుడు.. ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. ఇప్పుడు తన పర్యటనలో భాగంగా చంద్రబాబుకి ఎదురైనా పరిణామాల దృష్ట్యా ఆయన్ను పరామర్శించేందుకు కలవనున్నట్టు తెలుస్తోంది.
Rashmika Mandanna No Makeup Look: మేకప్ లేకుండా రష్మికను చూసి షాక్ తిన్న ఫ్యాన్స్
ఈ సందర్భంగా పవన్, చంద్రబాబు జీవో నం.1, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. జీవో నం.1 పై యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారా? ఇద్దరు కలిసి న్యాయపోరాటం చేస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఈ మీటింగ్ కేవలం పరామర్శకి, చర్చలకు పరిమితం అవుతుందా? లేక రాబోయే ఎన్నికల్లో కలిసి పోరాటం చేయడంపై క్లారిటీ వస్తుందా? అనేది చర్చనీయాంశం అవుతోంది. రెండు నెలల వ్యవధిలోనే పవన్, చంద్రబాబు రెండోసారి భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఒకరిపై మరొకరు సానుకూలంగానే స్పందించుకుంటున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లోనూ వీళ్లు పొత్తు పెట్టుకుంటారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటప్పుడు వీళ్లు భేటీ అవ్వడం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ విశ్లేషకులు అయితే.. వీరి పొత్తు తప్పకుండా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
Outdoor Games: ఈ ఔట్‌డోర్ గేమ్స్ ఆడితే.. త్వరగా బరువు తగ్గుతారు