Lakshmi Parvathi On Jr NTR Entry In Politics: జూ. ఎన్టీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడు? అనేది ఎప్పుడూ చర్చనీయాంశమే! ఓవైపు అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు తారక్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇంతకుముందు అతడు టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తారక్ రీఎంట్రీ ఇస్తే.. టీడీపీకి అతని క్రేజ్ కలిసొస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తారక్ మాత్రం ఇప్పుడిప్పుడే రాజకీయాలవైపు అడుగులు వేయాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం తన సినీ కెరీర్ మీదే అతడు పూర్తి దృష్టి సారించాడు. గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలోనూ తనకు రాజకీయాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందని, ఇప్పుడు కేవలం సినిమాల మీదే ఫోకస్ పెట్టానని క్లారిటీ ఇచ్చేశాడు.
Is it Good to Eat Leaves: ఈ ఆకులను ఖాళీ కడుపుతో తింటే ప్రయోజనాలెన్నో
అయినా సరే.. తారక్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చలు మాత్రం ఆగడం లేదు. ఆయా సందర్భాల్లో ఎవరో ఒకరు ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. లోకేష్‌కు నాయకత్వం అప్పగించేందుకు తారక్ సిద్ధంగా లేరని కుండబద్దలు కొట్టారు. ఎన్టీఆర్‌కి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం.. అతడు తప్పకుండా టీడీపీలోకి వస్తాడని అభిప్రాయపడ్డారు. ఇంతకుమించి తానేం మాట్లాడలేనని, టీడీపీలోకి తారక్ అడుగుపెట్టాక తాను స్పందిస్తానని అన్నారు. ప్రస్తుతానికి సీఎం జగన్ పాలన చాలా బాగుందని, శ్రీవారి ఆలయ నిర్వహణ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినాసరే.. జగన్‌ని ఎదురించలేరని పేర్కొన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత లక్ష్మి పార్వతి ఈ విధంగా స్పందించారు.
ఈ చిట్కాలు పాటిస్తే పడకగదిలో బాహుబలి మీరే..