MLA Malladi Vishnu Fires On Chandrababu Naidu Pawan Kalyan Meeting: జనసేన అధిపతి పవన్ కల్యాన్, టీడీపీ అధినేతి చంద్రబాబు తాజా కలయికపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదొక అపవిత్ర కలయిక అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరి కలయిక వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి.. రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేశారని మండిపడ్డారు. అయితే.. 2019లో వైసీపీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడతాడు కాబట్టే పవన్‌ను తాము దత్తపుత్రుడు అంటామన్నారు. దత్తపుత్రుడు అంటే చెప్పు తీసుకుని కొడతానని పవన్ అంటున్నాడని, మరి ఇప్పుడు చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో పవన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Lakshmi Parvathi: ఆ పని చేస్తే.. తారక్ టీడీపీలోకి తప్పకుండా వస్తాడు
తాజా భేటీతో పవన్, చంద్రబాబుల ముసుగు పూర్తిగా తొలగిపోయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా.. పక్క రాష్ట్రంలో కూర్చొని జీవో నం.1 పై చర్చించడమేంటని ప్రశ్నించారు. జీవో నం.1పై చర్చించేందుకు హైదరాబాద్‌లో సమావేశం అవ్వడం హాస్యాస్పదని ఎద్దేవా చేశారు. పవన్‌కు ఒక స్టాండ్ లేదని.. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి వెళ్లాడని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా ప్యాకేజీని కుదుర్చుకోవడానికే చంద్రబాబుని పవన్ కలిశాడని తెలిపారు. ఆ ఇద్దరు ప్రజల గురించి కాకుండా, కేవలం తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే కలుస్తున్నారని అన్నారు. వాళ్లిద్దరు ఏనాడూ ప్రజలకు ఆయా సంక్షేమ పనులు చేపట్టండని చెప్పిన దాఖలాలు లేవని, కేవలం రాజకీయ దురద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. అసలు ప్రజాసంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తులు వాళ్లు కాదన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం కుట్ర పన్నేందుకు పవన్, చంద్రబాబు కలిశారని ఆరోపించారు.
Rashmika Mandanna No Makeup Look: మేకప్ లేకుండా రష్మికను చూసి షాక్ తిన్న ఫ్యాన్స్