Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana On Govt Employees Transfer: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీకి అర్హులుగా ప్రకటించింది. అలాగే.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బదిలీలు, ప్రమోషన్లపై ఇవాళ చర్చించామని చెప్పిన ఆయన.. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే ప్రమోషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎంఈఓ-2 పోస్టులు 678 నియామక జీఓ రేపటి నుంచే సిద్ధం చేస్తామని.. 350 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, పీజీ టీచర్ల నియాకాలను సైతం రేపటి నుంచి ప్రారంభిస్తామని అన్నారు.
Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ప్రొమోషన్లు, బదిలీలపై స్ధిరమైన నిర్ణయం తీసుకున్నామన్న బొత్స సత్యనారాయణ.. పాత పాయింట్ల ప్రకారమే, తాము కోరిన టీచర్ల డిమాండ్‌ను సంతృప్తిపరిచామన్నారు. టీచర్లు, లెక్చరర్ల జీఓ స్కూళ్లు ప్రారంభించేలోగా ఇస్తామన్నారు. టీచర్ల యూనియన్ల అంగీకారంతోనే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేపట్నుంచే బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామని, 6249 మంది ఎస్‌జీటీ టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తామని తెలియజేశారు. 117 జివో ద్వారా ప్రభావితం అయిన వారికి అదనంగా 5 పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఇతరులు దయచేసి వివాదాలు సృష్టించొద్దని, ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు.. ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే.. ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. స్కూల్ అసిస్టెంట్‌ల సమస్యలను తెలియజేశామని, వాటి పరిష్కరించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పదోన్నతలకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2015-17లలో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి, బదిలీలు చేస్తున్నారని వెల్లడించారు. పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని తెలిపారు.
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?