Kodali Nani Strong Counter To AP BJP Incharge Sunil Deodhar: తనపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సునీల్ దేవ్‌ధర్ ఒక పకోడీ అని.. అతనిలాంటి పకోడీల వల్లే కర్ణాటకలో బీజేపీ దిగజారిందని విమర్శించారు. సునీల్ లాంటి వాళ్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న సునీల్ లాంటి నేతలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లేకపోతే.. కర్ణాటకలో వచ్చిన పరిస్థితే ఇతర రాష్ట్రాల్లో వస్తుందని హెచ్చరించారు.
NTR 30: సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి..
కాగా.. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో కొడాలి నానిపై సునీల్ దేవ్‌ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ కొడాలి నాని ఫేమస్ అయ్యాడని, అంతకుమించి ఆయన ఏం చేశాడని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతోందని అన్నారు. గుడివాడ యువతను కొడాలి నాని సర్వనాశనం చేస్తున్నాడని, అతడ్ని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలని పిలుపునిచ్చారు. తెలుగువారికి ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగను ఆయన క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారని ఆరోపించారు. ఏపీలో తమ బీజేపీ అధికారంలోకి వస్తే.. కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని అన్నారు. ఇలా తనపై చేసిన వ్యాఖ్యలకు గాను.. కొడాలి నాని పై విధంగా కౌంటర్ ఇచ్చారు.
Bride Left Wedding Ceremony: మూడు ముళ్లు పడగానే.. పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయిన వధువు
అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వంపై కూడా సునీల్ దేవ్‌ధర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. శిక్ష పడిన ఖైదీ, బూతుల ఎమ్మెల్యేల పాలనలో ఏపీ సర్వనాశనం అయ్యిందని.. అవినీతిమయమైన జగన్ పాలనని అంతం చేసేందుకు జనసేనతో కలిసి బీజేపీ పోరాడుతుందని అన్నారు. ప్రకృతి కారణంగా 45 డిగ్రీల వేడి ఉండే.. జగన్ పాలనలో అంతకుమించిన వేడితో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బును తాడేపల్లి ప్యాలెస్‌కు పంపుతున్నారని.. ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలదే ఏపీలో రాజ్యం నడుస్తోందని.. ఆలీబాబా 40 దొంగలు మాదిరి జగన్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.