ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన వేధింపుల విషయంపై చర్చ జరగగా సినీ హీరోలు అందరూ గతంలో తాడేపల్లికి వచ్చి జగన్ ను కలిసిన క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాస్ వివరించారు. చిరంజీవి నేతృత్వంలో హీరోలు అందరూ తాడేపల్లికి వచ్చినప్పుడు జగన్ సమావేశానికి రాలేదని…సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడాలని సూచించారని, దీనిపై చిరంజీవి…
RK Roja: పవన్ కల్యాణ్‌కి రైతు సమస్యలు మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.. హరిహర వీరమల్లు, OG సినిమా షూటింగ్ ల కోసం, బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామని ఆలోచన తప్ప... ప్రజా సమస్యల పట్టవని విమర్శించారు.. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించరన్నారు... పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లు చేసుకుంటే... రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు? అని ప్రశ్నించారు. ఈసారి పవన్ కల్యాణ్…
సూపర్ సిక్స్‌లో 90 శాతం అమలు చేసేశామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు.
అనంతపురంలో సూపర్ సిక్స్ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తిరుపతిలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌తో కలిసి పులివర్తి నాని మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్ సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.
Kakani Govardhan Reddy: నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు మా నిరసనతో అర్థమైంది అన్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వారి పోరును నీరుగార్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా…
రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్‌ను వివిధ ఫేజ్‌లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు.