ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.…
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన 3 రాజధానుల బిల్లు గత అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై సీఎం జగన్ మాట్లాడుతూ.. 3 రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని, కొన్ని సవరణలతో మళ్లీ బిల్లును ప్రవేశపెడుతామని అప్పుడే చెప్పారు. దీంతో 3 రాజధానుల బిల్లు రద్దు చేస్తారనుకున్న వారితో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ 3 రాజధానుల వచ్చే బడ్జెట్ సమావేశాల్లో…
ఏపీ రాజకీయాను ఒక్కసారిగా భగ్గుమనిపించిన అసెంబ్లీ ఘటనపై స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షినని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలుసునని ఆయన వెల్లడించారు. పత్రిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సభలో రికార్డులను కూడా పరిశీలించామని ఆయన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉందని ఆయన హితవు పలికారు. సభను పక్కదారి పట్టించేందుకు తన…
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని, అప్పులు తగ్గించి ఆదాయం పెంచుకోనే మార్గాలను అన్వేషించాలని హితవు పలికారు. రాష్ట్రానికి 6 లక్షల 22 కోట్ల రూపాయలకు…
ఏపీలో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కింది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస రావు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొడాలి, వంశీ, అంబటి, ద్వారంపూడి మాటలను వారి ఇంటి ఆడవాళ్లే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా వైసీపీ నేతల్లా మేము మాట్లాడగలం.. కానీ మాఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరంటూ మండిపడ్డారు. చంద్రబాబు భద్రత తీసి వస్తే కొడాలి నాని…
చంద్రబాబు నేటి ఉదయం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రోజా. తిరుపతిలో మీడియా ముందు చంద్రబాబు మాట్లాడిన విధానం చూస్తుంటే త్వరలోనే చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని అందరికీ అర్థమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా సరిహద్దు ప్రాంతాలను సీఎం జగన్ అప్రమత్తం చేశారని.. అంతేకాకుండా ఆ తరువాత భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు…
ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తూ సభను బయటకు వచ్చేశారు. అనంతరం తన ఛాంబర్ టీడీఎల్సీ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నేత ఇలా కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన టీడీపీ శ్రేణులను ఆవేదన గురి చేసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళనకు దిగారు.…
ఏపీలో రాజకీయాల రోజురోజుకు మారుతున్నాయి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ నేతలు వ్యక్తిగతంగా, తన భార్య భువనేశ్వరీ సైతం విమర్శించారంటూ.. ఇక ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సభను నిష్ర్కమించారు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఒక్కసారిగా విలపించారు. దీంతో తమ అభిమాన నేతను కించపరిచేలా మాట్లాడారని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా…