మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణంరాజు, అయ్యన పాత్రుడు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుకి వారికి భారత రత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవడనికి టీడీపీ కార్యకర్తలు సైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు.. కానీ, పదవులకోసం పాకులాడకూడదని హితవుపలికారు.. కార్యకర్తలకు సొంత ఎజెండాలు వద్దు అని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు.. దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న నారాయణ విద్యా…
లగేజీ ముసుగులో అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో రెండు కోట్లు విలువ చేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీఫక్కీలో 21 కిలోమీటర్లు చేజింగ్ చేసి 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోలీస్ నియామకాల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 411 సివిల్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 6100 సివిల్, ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 22న, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఈ పోస్టుల దరఖాస్తు…
పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీరు సిద్ధం కావాల్సిన సమయం రానేవచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో పోలీసు కొలువులు భర్తీ చేయనుంది.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ప్రతీ ఏడాది 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. సీఎం ఆదేశాలను అనుగుణంగా.. త్వరలోనే…
Pawan Kalyan: ఏపీలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా అంటూ ట్వి్ట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు. వర్తమాన విషయాలను పాత్రికేయులు ప్రజలకు అందించేందుకు నిబద్ధతతో పనిచేస్తారని.. వారిని అరెస్టులు చేసి కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఆరోపించారు. జర్నలిస్టును అరెస్ట్ చేయడంలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించలేదన్నారు. గన్నవరం విమానాశ్రయంలో బంగారం…