ఏపీలో సంచలనం కలిగించిన విజయవాడ వ్యాపారి అస్లాంది హత్యేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అస్లాంను హత్య చేసింది తానేనని అంగీకరించాడు వైసీపీ నాయకుడు షేక్ అన్వర్. ఖురాన్, భగవద్గీత, రాజ్యాంగం పుస్తకాలపై ప్రమాణం చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు అన్వర్. అస్లాం ను ఆయన భార్య నసీమాతో కలిసి తానే హత్యచేశానని అన్వర్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం అస్లాం పెద్ద కుమారుడికి తెలుసు. 14వ తేదీన రాత్రి ఓ పథకం ప్రకారం అస్లాంను హత్య చేశామని వీడియోలో వివరించాడు అన్వర్.
Read Also: Ram Sethu Teaser: రామసేతును రక్షించడానికి ఇంకా మూడు రోజులే ఉన్నాయి
తొలుత అతని భార్య నసీమా భర్తకు 23 నిద్ర మాత్రలను ప్రొటీన్ మందులో కలిపి ఇచ్చిందన్నాడు. ఆ తర్వాత అతను పూర్తి మత్తులోకి వెళ్లిపోవడంతో నాకు ఫోన్ చేసింది. నేను అక్కడకు వెళ్లగా అస్లాం నోటి వెంట నురగ వస్తుందన్నాడు. ఇంకా చావలేదని నిర్ధారించుకుని.. నేను దిండు పెట్టి ముఖంపై నొక్కితే.. ఆమె అతని కాళ్లు పట్టుకుందని హత్య జరిగిన విధానాన్ని వీడియోల పూసగుచ్చినట్టు చెప్పాడు. అతను చనిపోయిన తర్వాత అక్కడి నుంచి తాను వెళ్లిపోయానన్నాడు.
మెడికల్ పరిభాషలో పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల డ్రగ్ విషయం బయటకు రాలేదన్నాడు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నారు అన్వర్, నసీమా. ప్రియుడిపై మోజుతో… భర్తను చంపి.. కటకటాలు లెక్కిస్తుంది నసీమా. తండ్రి చనిపోవడంతో నసీమా జైలు పాలుకావడంతో… ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.
Read Also: Pragya Jaiswal: కాంచీపురం నారాయణ సిల్క్స్ షోరూం లో బాలయ్య హీరోయిన్ సందడి