New Police Posts: పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీరు సిద్ధం కావాల్సిన సమయం రానేవచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే పెద్ద సంఖ్యలో పోలీసు కొలువులు భర్తీ చేయనుంది.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ప్రతీ ఏడాది 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. సీఎం ఆదేశాలను అనుగుణంగా.. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది.. మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఖరారు చేశారు.. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు..
Read Also: Astrology : నవంబర్ 26, శనివారం దినఫలాలు
Also Read
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ఇక, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు.. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోస్టింగ్ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్సై (సివిల్)- 387, ఎస్సై (ఏపీఎస్పీ) – 96, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)- 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలియన్)- 2,520 భర్తీ చేయబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు, తెలంగాణలోను పోలీసు ఉద్యోగాల భర్తీకి పూనుకుంది ప్రభుత్వం.. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడడం.. రాత పరీక్షలు కూడా పూర్తి చేసి.. ఫలితాలు విడుదల చేశారు.. ఇక, డిసెంబర్‌లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైన విషయం విదితమే.. ఈ సారీ తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో యువత పోటీపడుతున్నారు.
తాజావార్తలు
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
-
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!