టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్చల్ చేశారు. తిరువూరులోని వైన్స్ షాపుల ప్రక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్ చేయించారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. పట్టణంలో ఉన్న నాలుగు మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మంగళవారం…
సోమవారం రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్‌ను కూడా సీఎం విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. 2024 ఏపీ అసెంబ్లీ…
నేడు విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా బాధితులకు అయన పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు నెల్లిమర్ల రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ఎస్ఆర్ పేట మంచినీటి పథకంను పరిశీలిస్తారు. నేటి నుండి 27 వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి…