Global Health Advisory Council: ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర ఆరోగ్య సేవల బలోపేతం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య రంగంలో వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన కోసం 10 మంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులతో ఉన్నత స్థాయి సలహా మండలి ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఇక, సలహా మండలి తొలి సమావేశం డిసెంబర్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. రాష్ట్ర…
రూ.3500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఉదయం ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలలోని 20 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మద్యం కుంభకోణం నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్న నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిగాయి. నకిలీ ఇన్వాయిస్‌లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కాం…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. అనాధ విద్యార్థినీ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు అందుతున్న జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ నెల కూడా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందచేయడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులను జనసేన…
ఇవాళ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ.. రైతులకు కొత్త పాస్ బుక్స్, రెవెన్యూశాఖలో ఉన్న సమస్యలు, భూసంస్కరణలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్న సీఎం నేడు మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. రూ.1290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం శంకుస్థాపనలో పాల్గొననున్న పవన్ బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం…
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్న నేతలు ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. మధ్యాహ్నం 2 :40 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్న జగన్ ఇవాళ కుప్పంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం అమరావతికి ఏపీ సీఎం ప్రకాశం…
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణ మొదలయ్యింది. పోలీసుల అదుపులో ఉన్న ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ పై దాడికి ప్రయత్నించిన ఘటనలో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజులు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను…
ఒంగోలులో టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం…
ప్రతీ రోగికీ సేవలందించాలని, ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని తాను కోరుతున్నా అని.. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…