న్యూయార్క్ లో పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఈ పర్యటనలో భాగంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం అయ్యారు.. ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ భేటీ అయ్యారు.