ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఓవైపు విచారణలు.. మరోవైపు.. కోర్టులో పిటిషన్లు.. ఇంకో వైపు.. పిటిషన్లపై విచారణ ఇలా.. ఈ రోజు కీలకంగా మారింది..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.. ఇక, ఈ నెల 12వ తేదీన మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు..
ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని అందరికీ తెలుసు.. ఏం ఆధారాలు లేకుండా ఎంపీని అరెస్టు చేయరన్నారు.. అయితే, బిగ్ బాస్ ను కూడా ఆధారాలు దొరకగానే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు.. ఈ స్కామ్ లో సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుందని వెల్లడించారు పెమ్మసాని..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ ఓ మంచి బాలుడు, గుణవంతుడు అని ఎద్దేవా చేశారు. జైళ్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని, మహిళా ఎమ్మెల్యేని విమర్శించిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ చాలా సేపు పలకరించారని విమర్శించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎంతో మంది జగన్ వల్ల జైళ్లకి పోతున్నారన్నారు. తమ నేతలు ఎంత మందిపై కేసులు పెట్టారు? అని…
Nara Lokesh Responds on YS Jagan Arrest: సింగపూర్ పర్యటన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు మంత్రి నారా లోకేష్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు, మద్యం కుంభకోణం.. పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అని ఓ మీడియా ప్రతినిథి ప్రశ్నించగా.. మంత్రి లోకేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. చట్టం తన పని…
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సిట్ టీమ్ ముంబై వెళ్లింది.. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)..
అర్ధరాత్రి వైసీపీ మహిళా నేతల ఇంటి తలుపు తీసి నోటీసులు తీసుకుని వెళ్లమని చెబుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మీకు ఏం పోయేకాలం వచ్చిందని, అర్ధరాత్రి నిద్రలేపి నోటీసులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. నెల్లూరులో ఉన్న 40 శాతం ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, ఇంట్లో వైఎస్ జగన్ ఫోటో ఉంటే చాలు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వాళ్లకు, చంద్రబాబు నాయుడుకు తేడా ఉందా? అని.. మహాత్మా గాంధీని కూడా…
ఏపీ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టానికి (పీఎంఎల్ఏ) చట్టం కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ.. సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడంతో దర్యాప్తు…