ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్‌మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ.. త్వరలోనే లబ్దిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం అన్నారు.. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు.. టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని విమర్శించారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ శాసనమండలి స్పందించింది. ఇందుకూరి రఘురాజును ఎమ్మెల్సీగా తిరిగి శాసనమండలి గుర్తించింది. ఇటీవల విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌పై రఘురాజు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టారు.. ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు.. దీని కోసం మండలం యూనిట్‌గా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.. ఇక, 2019-24 మధ్య పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్..
శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్.
గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు..
ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లినీ అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను కూడా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమాన కరంగా మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఏపీ శాసన మండలి నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. విజయనగరం జిల్లా గుర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన డయేరియా మరణాలపై పశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్ని మరణాలు జరిగాయి, చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది.
MLC Elections 2024: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో పోటీకి బలమైన అభ్యర్థుల అన్వేషణలో వైసీపీ, టీడీపీ పార్టీలు ఉన్నాయి. ఇక, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.