విశాఖలో వెలుగు చూసిన ఎక్సయిజ్ స్కామ్ పై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నేడు అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏకకాలంలో ఫిజికల్ వెరైఫికేషన్ చేయనున్నారు అధికారులు. సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో 33లక్షలు మాయం చేసిన విషయం తెలిసిందే. సిఐ ప్రమేయంతో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. ఇప్పటికే సిఐను విధుల నుంచి తప్పించిన అధికారులు… 12మంది వైన్ షాప్ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. గోల్ మాల్ అయిన నగదు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.