శుభకృత్ నామ ఉగాది సందర్భంగా సరికొత్త ఆశలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కొత్త గెజిట్ రూపొందించింది. కొత్త జిల్లాల పాలనకు అనుగుణంగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కలెక్టర్ల నియామకం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి, విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీ రావుని నియమించారు. విజయనగరం…
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగంగా సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి తుది నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు…
రాజకీయాల్లో 40ఏళ్లకు పైగా ఉన్న సీనియర్ నేత. ఆయనతో రాజకీయ ప్రస్ధానం మొదలు పెట్టిన నాయకులు సీఎంలై.. మంత్రులై చక్రం తిప్పారు. ఆయనకు మాత్రం మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. ఆయన గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఆయన గెలవరు. ప్రస్తుతం పార్టీ మారి అధికారపార్టీ పంచన చేరారు. ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందా? అసలు ఆయన అలాంటి ఆశలు పెట్టుకున్నారా? ఇంత వరకు మంత్రి కాని కరణం బలరాంకరణం బలరాం.…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వివాదం రేగుతూనే వుంది. వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేయడం మంచిది కాదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు అన్నారు. ఇక్కడే ఇల్లు కట్టాను.. అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం చెప్పలేదా..? ఎన్నికల ముందు మూడు రాజధానులని ఎందుకు అనలేదు..? అధికారం ఇచ్చారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు చేస్తారా..? రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తే… న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదా..? అన్నారు గద్దె తిరుపతిరావు. జగన్ గారూ.. ప్రజల…
ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయం బ్లాక్ వన్ లో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. సీపీఎస్ స్కీమ్ పై సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు అధికారులు. ఏప్రియల్ 4 నుంచి ప్రారంభం…
నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. మద్యం శాంపిల్స్ పై కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. పరీక్షలు చేసిన ఎస్జీఎస్ ల్యాబ్ ఇచ్చిన సమాధానం లేఖను మీడియాకు విడుదల చేశారు రజత్ భార్గవ. ల్యాబ్ కు పంపించిన శాంపిల్స్ ఏపీ నుంచి సేకరించినవే అనడానికి ఆధారాలు లేవు. పరీక్ష చేయటానికి ఎక్సైజ్…
రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్తున్నారా.. రద్దీ ప్రాంతాల్లో ఏదో ఒక మూల కార్ నిలిపి షాపింగ్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ కార్, బైక్ పార్క్ చేసి వెళ్తే ఇక పై కుదరదంటూ హెచ్చరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో ఇక పై పార్కింగ్ చేసే వాహనాలపై ఫీజు వసూలు చేసేందుకు సిధ్దమవుతున్నారు. ఇప్పటికే ఎడాపెడా పన్నులతో ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్ కార్పోరేషన్ పార్కింగ్…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలను ఆదుకుంద వైఎస్సార్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మైనార్టీల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. మైనార్టీలకు పొలిటికల్ ఎంపవర్ మెంట్ ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకూ పదవులిచ్చిన గొప్ప నేత జగన్. భారతదేశ…