ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారారని ఆరోపించారు. వచ్చిన ప్రతి ఫైలుపై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టేస్తున్నారని.. ఇది సరికాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. కాగ్ నివేదికలు గవర్నర్ వద్దకు వెళ్తే.. వాటి గురించి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలోనూ కనిపిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు ఏపీని వైసీపీ…
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను జగన్ కోరనున్నారు. మరోవైపు ఈనెల 7న ప్రస్తుత కేబినెట్‌తో…
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై…
ఏపీలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా ఆగిన వివిధ రకాల విద్యావిధానాలు మళ్ళీ గాడిలోపడుతున్నాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలుస్తోంది. యోగి వేమన, అచార్య ఎన్ జి రంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ జెఎన్ టియు, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో…