Ap Governor Justice Abdul Nazeer: ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ap Governor Justice Abdul Nazeer oath ceremony: ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత రాజ్ భవన్ లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకారం అనంతరం నేతలు, అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. బిశ్బభూషణ్ హరిచందన్ స్థానంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్ గా నియమితులయ్యారు.
Read Also: Ap Governor Oath Ceremony Live: ఏపీ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం
Also Read
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
1958 జనవరి 5న కర్ణాటకలోని మూడబిదరి తాలూకా బెలువాయిలో జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే సాగింది. అక్కడి మహావీర కళాశాలలో బీకాం చేసిన ఆయన, మంగళూరు కొడియాల్‌బెయిల్ ఎస్‌డీఎం లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి నాలుగో తేదీ వరకు సర్వోన్నత న్యాయస్థానంలో సేవలందించారు. పదవీ విరమణ తర్వాత ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా బదిలీపై వెళ్లారు.
Read Also: Bengaluru: బెంగళూర్ నగరంలో అక్రమంగా 600 మంది విదేశీయులు తిష్ట..
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!