తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పదనం ఇక ఏ భాషలోనూ లేదని ఎందరో కవులు కీర్తించారు.. తేనెలొలుకు భాష.. మన తెలుగు భాష.. అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష..
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చినందున పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి మరికొంత సమయం అవసరం అని గెజిట్‌లో గవర్నర్ పేర్కొన్నారు.
AP Governor: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లి, గవర్నర్‌ను కలసి.. రాష్ట్రంలో టీడీపీ అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నారు.
రాజ్ భవన్ లో ఎన్డీయే కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్టు గవర్నుకు లేఖ అందించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు.
ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్.. జ్యోతి ప్రజ్వలన చేసి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, కళాశాల డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు.