ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు.తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రస్తుతించారు. సిరివెన్నెల…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం రాత్రి హుటాహుటిన అధికారులు ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం తొలుత ఈనెల 15న గవర్నర్ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో…
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ హరిచందన్ డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట జలుబు, దగ్గు వంటి లక్షణాలతో గవర్నర్ హరిచందన్ బాధపడుతుండటంతో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. Read Also: బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్ మరోవైపు గవర్నర్ సతీమణికి కూడా కరోనా…
వైఎస్ఆర్ అవార్డు గ్రహీతలకు అందరికి నా శుభాకాంక్షలు అని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అత్యున్నత సేవలు చేసిన వారికి అవర్డులు ఇవ్వడం ఏపీ చరిత్రలో గొప్ప విషయం. సీఎం జగన్ సూచనలతో లిస్టు తయారు చేసిన జ్యూరీకి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ స్ఫూర్తిదాయక నేత అని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల హృదయాలలో నిలిచారు వైఎస్ఆర్. ఈ అవార్డులు 2020లో ఇవ్వాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఆలస్యం కావడంతో కొందరు అవార్డు గ్రహీతలు మన మధ్య…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని గుర్తుచేశారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను రాష్ట్రం కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు…
శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ వెబినార్ ద్వారా గవర్నర్ కీలకోపన్యాసం చేశారు. పురాతన జ్ఞాన సంపద వల్లే ప్రపంచ వేదికపై విశ్వగురుగా భారతదేశం నిలిచిందని ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. గొప్ప వారసత్వం, సహజ వనరులు, సైనిక బలం ఫలితంగా భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది. భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. భారతీయ వేదాలు అంతర్జాతీయ సౌభ్రాతృత్వం,…
ఏపీలో టీడీపీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయా? గవర్నర్ అపాయింట్‌మెంట్ పొందడంలోనూ ఆ పార్టీ విఫలం అవుతోందా? లోపం ఎక్కడుంది? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రణాళికలో లోపమా? మరేదైనా కారణమా? రాజకీయ పార్టీలు గవర్నర్‌తో భేటీ కావడం సాధారణం. ప్రభుత్వాలపై ఫిర్యాదు చేసేందుకు.. వివిధ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తుంటారు నాయకులు. గవర్నర్ వ్యవస్థపై టీడీపీకి మొదటినుంచి తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ఆయా సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో…
ఏపీ గవర్నరును కలిశారు టీడీపీ నేతలు. జీవోలు పబ్లిక్ డొమైనులో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందనుకు టీడీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా తేదీ, జీవో నెంబర్ వేసి వదిలేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు జీవోలు ఆన్లైన్లో పెట్టాలని ఆదేశాలిచ్చింది. రాత్రి పూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం జీవోలు ఆన్లైన్లో పెడుతుందా లేదా అనేది ఒక వారం రోజులు…
విజయవాడ రాజ్ భవన్ లో కరోనా థర్డ్ వేవ్ నివారణ పై అవగాహన -స్వచ్ఛంధ సంస్ధల పాత్ర అంశంపై శుక్రవారం వెబినార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ… కరోనా మూడో తరంగ నివారణలో రాష్ట్రం దిక్సూచీ కావాలి అన్నారు. కరోనా మూడవ తరంగం రాకుండా నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతరులకు దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి విడతలలో పలు స్వచ్ఛంధ సంస్ధలు అద్భుతంగా…