Vijay Sai Reddy: కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ తో విజయసాయి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి న్యూఢిల్లీ లో ఆయన స్వగృహంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో ఆయనకున్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు కలగజేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఇప్పటివరకూ సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అపార అనుభవం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి ఎంతో మేలు కలగజేస్తుందని విజయ సాయిరెడ్డి అన్నారు. సోమవారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి∙దంపతులు భేటీ అయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని రాజ్‌భవన్‌లో తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం జగన్. ఛత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బిశ్వభూషన్ హరిచందన్ బదిలీ కావడంతో ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్ల పాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న బిశ్వభూషన్ హరిచందన్‌కు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అనేక అంశాల్లో తనకు సలహాలు, మార్గదర్శకత్వం వహించారన్నారు సీఎం.
Also Read
Read Also: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!