Minister Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో పరుగులు తీస్తోంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గా విశాఖ ఆవిర్భవిస్తుంది.. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తుంటే 50శాతం విశాఖకే వస్తున్నాయి.. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని పేర్కొన్నారు.
No Plastic In AP Secretariat: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి రాష్ట్ర సెక్రెటేరియట్ లో నో ప్లాస్టీక్ విధానం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇక నుంచి గాజు, స్టీల్ సీసాలతో నీటి సరఫరా చేయనున్నారు.
Green Hydrogen Valley: నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు సమక్షంలో గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్‌పై రెండు రోజుల పాటు సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే. అమరావతిలో జరిగిన ఈ సమ్మిట్‌లో 600 మంది ప్రతినిధులు, ఇండస్ట్రీ…
“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. "గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు…
కైకలూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు, ప్రజలతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న తరుణంలో కొల్లేరు నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గడిచిన 25 ఏళ్ళ నుంచి పర్యావరణ వేత్తలు పర్యావరణం తప్ప మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కొల్లేరులో పక్షులు బతకాలి.. మనుషులు కూడా ముఖ్యమే అని తెలిపారు. మొదటి సారి ప్రజల మనుగడ గురించి హస్తినకు తెలియజేసిన ఘనత…
ఆంధ్రప్రదేశ్‌లో ఉమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇప్పటి వరకు ఉండేది.. ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Minister Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని మాట్లాడారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కాకుండా పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం తెచ్చామన్నారు. వినియోగదారుడికి కొన్ని హక్కులు ఉన్నాయని.. వినియోగదారుడికి వ్యాపారులు కొన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అమ్మకందారులు కూడా బాధ్యతగా ఉండాలంటే చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కుబడిగా అవగాహన కార్యక్రమం చేయటం కాకుండా…
ఏపీ ప్రభుత్వం గ్రామీణ, జిల్లా స్థాయిలో ఉత్పాదకత పెంచడం, వ్యాపార, ఉపాధి అవకాశాలు పెంచడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఒకే చోట కలిసి పని చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోమ్‌తో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.