Minister Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంతో పరుగులు తీస్తోంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గా విశాఖ ఆవిర్భవిస్తుంది.. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధిస్తుంటే 50శాతం విశాఖకే వస్తున్నాయి.. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో పని చేస్తున్నాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడమే కాదు నిర్వహణ కోసం అవసరమైన భారీగా సహాయం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 3 వేల కోట్లు ఇచ్చింది అని లోకేష్ గుర్తు చేశారు
Read Also: Diane Keaton “హాలీవుడ్‌లో విషాదం.. ఆస్కార్ నటి డయాన్ కీటన్ ఇక లేరు”
అయితే, మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఆపరేషన్ లోకి తెచ్చామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నం ఎకనామిక్ పవర్ హౌస్ గా మారుతుంది.. ఇక్కడ అభివృద్ధికి కేబినెట్ నాకు బ్లాంక్ చెక్ లాంటి అవకాశం ఇచ్చింది.. హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే ఆ స్థాయికి రావడానికి విశాఖకు కేవలం 10 ఏళ్లలో చేరుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ ఎకో సిస్టం అభివృద్ధికి సీపీ యాజమాన్యం ముందుకు రావాలి అని కోరారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ గా విశాఖ నిలవనుంది. ఒక్క అవకాశం కూడా రాష్ట్రం నుంచి చేజారకుండా పని చేస్తున్నామని ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.