కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు. పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి…
ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తు పొడుపులు పొడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఈమధ్యే మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి 1) జనసేన+బీజేపీ పొత్తు, 2) జనసేన+టీడీపీ+బీజేపీ పొత్తు, 3) జనసేన ఒంటరిగా పోటీ చేయడం. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు రెండురోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. జేపీ నడ్డాతో జరిపిన కోర్ కమిటీ భేటీలో పౌత్తుల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులపై…
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు పవన్. రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం…
ఏపీలో తరచూ వినిపిస్తున్న పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక.. మిగిలిన విషయాలు మాట్లాడతాం.రాష్ట్రం కోసం నేను తగ్గడానికి సిద్దం. అన్నిసార్లు తగ్గాను.. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాను. టీడీపీ కొంత తగ్గితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ సూచించారు. బీజేపీతో సంబంధాలు బాగున్నాయంటూ పవన్ స్పష్టీకరించారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లపై చర్చిద్దామని…
ఏపీలో ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన వ్యవహారం నడుస్తోంది. గతంలో పొత్తుల గురించి మాట్లాడిన పవన్ పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల విమర్శలపై అదేరేంజ్‌లో పవన్ ఫైరయ్యారు. మరోసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పునరుద్ఘాటించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే అది వైసీపీకే లాభం. అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు ఒక కూటమికి పడితే అది లాభం అవుతుంది. ఓటు చీలిపోతే వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారు. స్వల్ప ఓట్ల తేడాతో…
ఏపీలో జగన్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు అస్త్రాలు ఎక్కుపెడుతూనే వున్నారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమే. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారు. వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా…
ఏపీలో ఇటీవల నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 నగరపంచాయతీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కొన్ని స్థానాల్లో వైసీపీ దూసుకుపోగా, మరొకొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటారు. అయితే తాజాగా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపల్లి మున్సిపాలటీలో 29 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలువగా, మరో 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీరితో…
నేడు ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వైసీపీ జెండా ఎగరవేసింది. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో కూడా వైసీపీ తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు స్వీయ తప్పిదాలే టీడీపీ పతనానికి కారణమని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి ఒక్కటే తన ఎజెండా అనుకున్నారని, అందుకే మిగతా ప్రాంతాల ప్రజలు తగిన బుద్ధి…
ఏపీలో నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు పెండింగ్‌లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీలకు పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ-టీడీపీ మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు సాగింది. మొత్తం 20 వార్డులకు గాను టీడీపీ 13 వార్డులు గెలుచుకొని దర్శి నగర పంచాయతీ చైర్మన్…
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకన్న కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. Also Read: వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఇదే కాకుండా పలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు…