ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ మైకేల్ క్రేమెర్ ప్రశంసలు గుప్పించారు. గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి మైకేల్ క్రేమెర్‌తో పాటు పాటు చికాగోలోని డీఐఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ క్యుపిటో బృందం సందర్శించారు.
ఇప్పటికే విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.. ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు
పాఠ్య పుస్తకాల విషయంలో కొత్త విధానానికి ఏపీ విద్యా శాఖ బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చే విధానాన్ని ఏపీ విద్యాశాఖ తీసుకొస్తోంది.
Budget 2023-24: బడ్జెట్‌లో సంక్షేమం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. మొత్తం బడ్జెట్ లో ఆర్ధిక సేవలకు వ్యయం 69, 306 కోట్లుగా ఉంది.. బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది.. 51,345 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయించారు.. మొత్తం కేటాయింపుల్లో ఇది 27 శాతం.. సాధారణ విద్యకు రెండో ప్రాధాన్యత కేటాయింపులు లభించాయి.. మాధ్యమిక, ఉన్నత విద్యకు 32,198 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల్లో ఇది…
MohanBabu University: స్వప్నించు (డ్రీమ్), విశ్వసించు (బిలీవ్), సాధించు (అఛీవ్) అని బోధిస్తున్న మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ).. అనుభవజ్ఞులు, అత్యుత్తమ ప్రతిభ కలిగినవారు, అకడమిక్ లీడర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంబీయూ సక్సెస్ స్టోరీలో పాలుపంచుకోవాలని కోరుతోంది. విద్యా రంగంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో, నమ్మకానికి మారుపేరుగా మారిన తమ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది.
ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడిపై ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఏపీ ప్రజలు జగన్ శాశ్వత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని నమ్ముతున్నారు. లోకేష్ బాబు ఆయన బాబు చంద్ర బాబు ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు.ఎల్లో మీడియా అమ్మ ఒడి పథకంపై నానా తప్పులు రాస్తుందన్నారు. తల్లిరొమ్ము పాలు తాగిన ఏ వ్యక్తి అమ్మ ఒడిని విమర్శించరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకువచ్చింది. హైదరాబాద్ లో మంత్రి ఆదిమూలపు…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో…
ఏపీలో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు మారుతున్నాయి. కరోనా కారణంగా ఆగిన వివిధ రకాల విద్యావిధానాలు మళ్ళీ గాడిలోపడుతున్నాయి. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలుస్తోంది. యోగి వేమన, అచార్య ఎన్ జి రంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాకినాడ జెఎన్ టియు, శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్న నేపధ్యంలో…