ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా అదుపులో వుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.సంక్రాంతి శెలవుల తర్వాత స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యాయి. ఎంత మంది వచ్చారనే అటెండెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు. గత రెండేళ్లల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాం.విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇస్తున్నాం.సుమారు 22 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసేశాం.విద్యార్ధులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తైంది.టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ వేశాం.ఎకడమిక్ ఇయరుని ముందుగా నిర్ణయుంచుకున్న…