AP TET 2022 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఇదిగోండి లింక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP TET 2022 Results Released: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET-2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, PHC, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేశాక 58.07 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 4,07,329 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ దాకా అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 150 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. నిజానికి.. ముందుగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14వ తేదీనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు విడుదల చేయడం కుదరలేదు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను https://cse.ap.gov.in/DSE/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదిలావుండగా.. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఖాళీగా ఉన్న 269 స్థానాల్ని భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో గ్రూప్-4 కింద 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ విభాగంలో 45, ఆయుర్వేద లెక్చర్ల విభాగంలో 3, హోమియో లెక్చరర్ల విభాగంలో 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ విభాగంలో మరో 72, హోమియో మెడికల్ ఆఫీసర్ విభాగంలో 53, యునాని మెడికల్ ఆఫీసర్ విభాగంలో 26, ఏఈఈ విభాగంలో 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 7 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు తగినట్లు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ఏపీ ఆర్‌జేయూకేటీ (RJUKT) ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా గురువారం విడుదల చేశారు. మొత్తం 44,208 మంది దరఖాస్తు చేసుకోగా.. 66 శాతం మంది అమ్మాయిలు, 23 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. జల్లెల నందిని మయూరీ అనే అమ్మాయి ఈ ఫలితాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచింది.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!