CM Chandrababu: పెట్టుబడులపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం.. నేడు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ
- రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం..
- పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..
- దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు..
- ఇవాళ ఏపీ సీఎంతో టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి.. పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. గతంలో వెనక్కి వెళ్లిన సంస్థలను మళ్లీ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు..
Also Read
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
- Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
ఇక, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకానున్నారు టాటా గ్రూపు ఛైర్మన్ నజరాజన్ చంద్రశేఖరన్. ఉదయం 10.30 గంటలకు టాటా గ్రూప్ ఛైర్మన్‌తో సమావేశం జరగనుంది.. అనంతరం సీఎంతో భేటీకానున్నారు CII ప్రతినిధుల బృందం. CII డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీకానున్నారు సీఐఐ ప్రతినిధులు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. కాగా, అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పరిశ్రమలు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. ఇక, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?