Adilabad: హనీ ట్రాప్‌లో ఇదో రకం. కేవలం బైక్ మీద లిఫ్ట్ అడిగిన లేడీ కిలాడీ.. తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నుంచే డబ్బులు గుంజింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మహిళతోపాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. బైక్ మీద వెళ్లే వాళ్లు.. సాధారణంగా ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. కాదనకుండా ఇస్తారు.. అందులోనూ మహిళలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే.. వారు ఇబ్బంది పడకూడదని.. మానవత్వంతో వారు దిగాల్సిన చోటు వరకు…
Bheemili Domestic Violence: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య వేడివేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సలసల కాగే నీటికి అతడి ముఖం, ఛాతి భాగం కాలిపోయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై…
Konaseema District 10th Class Student Pregnant: విద్యాబుద్ధులు నేర్పాల్సిన కరస్పాండెంట్.. విద్యార్థిని పట్ల అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి విద్యార్థినిని బలవంతంగా అత్యాచారం చేశాడు. మైనర్ బాలికకు పీరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. 5వ నెల గర్భవతి అని వైద్యులు దృవీకరించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేయగా.. కరస్పాండెంట్‌పై పోక్సో కేసు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు…
అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. తిరుపతి మంగళం బొమ్మల క్వార్టర్స్ లో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉషకు.. గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు. ఉషా, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.…
పరువు హత్యలు ఆగడం లేదు. గతంలో ఎవరైనా ప్రేమ జంట.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత అఘాయిత్యాలు చేసేవారు. కాకినాడ జిల్లాలో తాజాగా ప్రేమ పేరుతో టచ్‌లో ఉన్న యువకున్ని..యువతి సోదరుడు హతమార్చాడు. వేమవరంలో ఈ హత్య కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు కిరణ్ కార్తీక్. కాకినాడ జిల్లా వేమవరం స్వస్థలం. అతని తండ్రి వెంకటరమణ ఉప్పాడలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. తండ్రికి సహాయంగా కిరణ్ కార్తీక్ కూడా…
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడిని కన్న తండ్రే కడతేర్చాడు. సోమవారం రాత్రి జరిగిన కొట్లాటలో కసాయి కొడుకుని తండ్రి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… Also Read: AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన! గోళ్ల వెంకటనారాయణ…
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, కోటేశ్వరరావులు వివాహానికి వెళ్లి బైకుపై తిరిగి గ్రామానికి వస్తుండగా బోదిలవీడు సమీపంలో కారుతో గుద్దించి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనం కూడా టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్యది అని తేలింది. కొంతకాలంగా వెంకట్రామయ్య, జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది.