Physical Harassment: నంద్యాలలో ఒంటరి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు త్రీ టౌన్ సీఐ కంబగిరి రాముడుపై ఆరోపణలు వచ్చాయి. 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన బాధితురాలు ప్రస్తుతం భర్త పని చేసిన ఉద్యోగంలోనే కొనసాగుతుంది. అయితే, బాధితురాలు, సీఐ కంబగిరి రాముడు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకుని సీఐ లైంగికంగా వేధిస్తున్నారని బాధితురాలు పేర్కొనింది.
Read Also: School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు
అయితే, ఈ లైంగిక వేధింపులు తట్టుకోలేక బాధితురాలు నంద్యాల జిల్లా ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసింది. సీఐ కంబగిరి రాముడిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. ఇక, ఈ ఆరోపణలను సీఐ కంబగిరి రాముడు తీవ్రంగా ఖండించారు. బాధితురాలి ఆరోపణలు అవాస్తవం, ఈ అంశం ఇప్పటికే ఉన్నతాధికారుల విచారణలో ఉందని చెప్పుకొచ్చారు.