త్వరలోనే విశాఖ,గుంటూరుకు రాహుల్ గాంధీ రానున్నారు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. అమరావతి,విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా పర్యటన చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ కొరత ఉంది.. సిద్దాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన నాయకత్వం లేదు. అటువంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాం అని చింతా మోహన్ తెలిపారు. త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయి. కానీ అధ్యక్షుడు ఎన్నికల రేస్ లో నేను లేను…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం దృష్టి సారిందించి. 2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజలు కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎన్నికల్లో చూపించారు. అయితే, ఈ సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచింది. అయినప్పటికీ ఏపీలో పార్టీ ఇంకా కోలుకోలేకపోతున్నది. పార్టీని తిరిగి బలోపేతం చేసి తిరిగి గాడిలోకి తీసుకొస్తే ఎప్పటికైనా ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ… ఈ నెల 11న ఏపీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు జరగనున్నాయి.. 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి విడివిడిగా ఏపీ సీనియర్ నేతలతో ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు అందింది.. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పలు కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని తెలుస్తోంది.. పీసీసీ…
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై రాహుల్ కీలక మంతనాలు చేస్తున్నారు. త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీకి రావాలని కొంతమంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు ఇచ్చింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు రాహుల్. ఏపీ రాష్ట్రానికి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులతో విడివిడిగా, ముఖాముఖి సమాలోచనలు జరపనున్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీని ఏపిలో బలోపేతం చేసేందుకు రాష్ట్ర నేతల ఆలోచనలు, అభిప్రాయాలను…
ఏపీ కాంగ్రెస్ వ్వవహారాల పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. ఏపీ సీనియర్ నేతలతో స్వయంగా మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. వచ్చే 15 రోజులలో సీనియర్ నాయకులందరినీ ఢిల్లీ కి రావాలని పిలుపునిచ్చారు. విడివిడిగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరితో రాహుల్ సమాలోచనలు చేయనున్నారు. రాష్ట్ర సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పీసీసీ పై నిర్ణయం తీసుకోనుంది. సుమారు 20 మంది సీనియర్ నాయకుల జాబితాను సిధ్ధం చేసారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్…