ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమార్పులు చేసింది అధిష్టానం.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజుని నియమించింది అధిష్టానం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలి, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి. రాకేశ్ రెడ్డిని.. ఏఐసీసీ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా ఎంఎం పళ్లంరాజును.. క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా జీవీ హర్షకుమార్‌ను నియమించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఏఐసీసీ ఇచ్చిన పదవిని తిరస్కరించారు మాజీ ఎంపీ హర్షకుమార్.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి…
జగన్ పాలనపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు దుష్మన్ ప్రభుత్వంగా మారిందన్నారు. సి.ఎం జగన్ మోహన్ రెడ్డి 32 నెలల కాలంలో వ్యవసాయ, సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ,సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తులసిరెడ్డి మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చేతులు ఎత్తేశారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో…
తెలంగాణ కాంగ్రెస్ .. ఏపీ కాంగ్రెస్‌కి అప్పు పడిందా..!? పాత బకాయిని వసూలు చేసుకునే పనిలో ఏపీ నేతలు ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీసీసీకి ఆ మొత్తం ఇప్పుడు చాలా అంటే చాలా అవసరమా? ఇంతకీ టీపీసీసీ చెల్లించాల్సిన అప్పు ఎంత? టీపీసీసీ, ఏపీసీసీ మధ్య అప్పుపై కాంగ్రెస్‌లో చర్చ..! తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల మధ్య ప్రస్తుతం అప్పు పంచాయితీ నడుస్తోంది. అదీ 2014 నుంచీ వసూలు కాకుండా ఉండిపోయిన అప్పుగా చెబుతున్నాయి పార్టీ…
2014 నుంచి కునారిల్లుతున్న ఏపీ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫోకస్ పెట్టిందా? త్వరలో సారథి మారనున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టు నాగంబొట్టు తరహాగా మారింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభలోనూ జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా హస్తవాసి బాగుంటుందా అంటే అలాంటిదేం లేదు. ఏయేటికాయేడు పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. అసలు పార్టీ వుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు ఏపీ పీసీసీ చీఫ్ శైలజా నాథ్ చురకలు అంటించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి పీకేది కాదని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమన్నారు. ప్రశాంత్ కిషోర్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు ఏమైనా తెలుసా అంటూ మండిపడ్డారు. ఏపార్టీ డబ్బులు ఇస్తే..…
ఏపీలో కాపుల జనాభా కోటి మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కాపు అభ్యర్థి ఉండాలని తిరుపతి కాంగ్రెస్ మాజీ ఎంపి చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 70 ఏళ్ల లో కాపులు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, వారిలో చైతన్యం అవసరమని ఆయన అన్నారు. అంతేకాకుండా అన్ని పార్టీలను కలిసి కాపులను ముఖ్యమంత్రి చేయాలని కొరతానన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు…
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గత వైభవాన్ని సంతరించుకునేందుకు పావులు కదుపుతున్నది. తెలంగాణలో పీసీసీలో మార్పులు చేసిన తరువాత దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంటే, ఏపీలో అందుకు విరుద్ధంగా ఉండటంతో పార్టీలో తిరిగి నూతనోత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ లోని కీలక నేతంతా…