ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు ఎస్ఎన్బీసీ సమావేశం జరిగింది. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. స్కూళ్లు, ఆసుపత్రులను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామని, అగ్రి ఇన్ఫ్రా, గృహాలు, ఇతర వ్యవసాయ రంగాల్లో బ్యాంకుల సమర్ధత పెరగాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నట్టు తెలిపారు. చికిత్సకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు సీఎం తెలిపారు.…
ఆస్తి పన్ను పెంపు పై సీపీఐ,సీపీఎం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం లో పాల్గున్న సీపీఐ రామకృష్ణ,సీపీఎం మధు,టీడీపీ గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఎం మధు మాట్లాడుతూ… సీఎం మూడు రాజధానులు అంటారు, బిజెపి ఒకే రాజధాని అంటుంది. అమరావతి పై బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం తో ప్రకటన చేయించాలి. పన్నుల భారాల అంశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పాపం పెరిగినట్లు ఆస్తి పన్ను కూడా ప్రతి…
కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు 2008 డీఎస్సీ అభ్యర్థులు.నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 2,193 మంది అభ్యర్థులు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా ఉద్యోగసంఘం నేత వెంకటరామి రెడ్డి మాట్లాడుతూ… ఈ ఏడాది అక్టోబరు 2న రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరాం.…
వైఎస్సార్ బీమా పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్ బీమాలో మార్పులు చేసారు. క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించనుంది. కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం… ఒకవేళ సంపాదించే…
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. పిటీషనర్ రాజకీయ దురుద్దేశ్యంతోనే పిటీషన్ దాఖలు చేశారని, పిటీషనర్ తన పిటీషన్లో వాడిన భాష, తీవ్ర అభ్యంతరకరంగా ఉందని పిటీషనర్ రూ.900 కోట్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని కౌంటర్లో పేర్కోన్నారు.…
ఈరోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి సిద్ధమై మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ప్రతి వైద్య కళాశాలతో…
బ్లాక్ ఫంగస్ కేసుల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో… రాష్ట్రంలో మొత్తం 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన ఇంజెక్షన్లతో కలిపి 3,445 ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఇంజక్షన్లు 5,200. అవసరాల్లో ఇది 10 శాతమే అని తెలిపిన సీఎం వైఎస్ జగన్ కేసుల సంఖ్యను చూస్తే వచ్చే వారం రోజుల్లో కనీసంగా 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు…
ఇరిగేషన్‌పై సీఎం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో… పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించారు అధికారులు. అలాగే స్పిల్‌వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయి. జూన్ 15 కల్లా మిగిలిన పనులు పూర్తిచేస్తామని… ఈనెలాఖరు కల్లా స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. ఇక వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆధీశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. అయితే ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖరాశామని,…