చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా…
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఏపీ బీజేపీ నేతలకు ఊపు తెచ్చిందా? లేక ఆ ఒక్క విజిట్‌తో అంతా తారుమారైందా? ఇంతకీ ఆ భేటీ ముందుగానే ప్లాన్ చేశారా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! కేంద్ర పథకాలకు రాష్ట్రాలు స్టిక్కర్లు వేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శ! కేంద్ర కేబినెట్‌లో పదోన్నతులు పొందిన మంత్రులు.. ఆయా రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్రలు మొదలుపెట్టారు. ఆ విధంగా ఏపీకి వచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తిరుపతి,…
రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్న సీఎం… జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు సీఎం. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం… ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక…
ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంటున్నారు? ఏంటా రగడ? లెట్స్ వాచ్! ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించిన సీఎం? ఏపీ బీజేపీ నేతలను కట్టడి చేయాలని సీఎం జగన్ మంత్రులను ఇటీవల ఆదేశించారు. అఫీషియల్…
ఏపీ తాలిబన్ రాజ్యంగా మారింది. పోలీసుల గన్నులు పెట్టి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే మహిళలకు రక్షణ లేకుండా పోయింది.ప్రతిపక్ష పార్టీగా మాకు నిరసన చేసే హక్కులేదా… నిరసనలు ,పరామర్శలు చేస్తే అరెస్టులు చేసేస్తారా అని ప్రశ్నించారు. నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలు చేసిన తప్పేంటి. అసలు రాష్ట్రంలో దిశ చట్టం ఉందా.. అమల్లోకి వచ్చిందా అని అడిగారు. ముఖ్యమంత్రికి పిచ్చిపట్టి ఏం మాట్లాడితే,…
ఇప్పుడా జిల్లాలో మంత్రిగారు పెట్టుకున్న ఉంగరం హాట్ టాపిక్. ఆయనకు కరోనా వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పార్టీలో, కేడర్‌లో ఆ ఉంగరం చుట్టూనే చర్చ జరుగుతోంది. అసలే మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు వస్తున్న వేళ.. అమాత్యులవారి చేతికి ఆ రింగ్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఆయనెవరో.. ఆ ఉంగరమేంటో.. ఈ స్టోరీలో చూద్దాం నారాయణస్వామి ఉంగరంపై చర్చ! నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నుంచి వరసగా…
కరోనా థర్డ్‌వేవ్ సన్నద్ధత పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… మూడోవేవ్ వస్తుందన్న సమాచారంతో గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్రతమతగా ఉండాలి అని కలెక్టర్లకు స్పష్టం చేశారు, థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదు కానీ , మనం అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల వారీ ప్రణాళికల ప్రకారం ఆగస్టు చివరినాటికి అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఆస్పత్రుల్లో అవసరాలమేరకు మౌలిక సదుపాయాలను, ఆక్సిజన్‌బెడ్లను పెంచుకోవాలి అని సూచించారు. అన్నిరకాలుగా మందులు, బయోమెడికల్ ఎక్విప్‌మెంట్లను సిద్ధంచేసుకోవాలి. స్టాఫ్ నర్సులకు పీడియాట్రిక్…
స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలి. వీటి సమర్థ మెరుగుపడాలంటే ఇనస్పెక్షన్ జరగాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు ఇనస్పెక్షన్లు చేయాలి. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి 4 సార్లు…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో హిందూమతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గోవధచట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాట్లాడడంపై ఆగ్రహం. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా.. భారతీయులను కించపరస్తారా అని పరామర్శించారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి లేదా ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. తరచుగా హిందువులను కించపరిచే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలి. దేవాలయాలు ధ్వంసం చేసిన…